Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త‌న‌ను తానే పెళ్లి చేసుకున్న ఇటాలియ‌న్ యువ‌తి... ఒంట‌రిగా హ‌నీమూన్ కూడా వెళ్లిన వైనం

  • మ‌గాడి మీద ఆధార‌ప‌డే ఉద్దేశం లేద‌న్న పెళ్లికూతురు
  • స‌రైన‌వాడు దొర‌క‌క‌పోవ‌డంతోనే ఈ నిర్ణయం
  • అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లి తంతు
ఇట‌లీకి చెందిన 40 ఏళ్ల లారా మెసీ ఫిట్‌నెస్ శిక్ష‌కురాలిగా ప‌నిచేస్తోంది. ఓ వ్య‌క్తిని పెళ్లిచేసుకుని 12 ఏళ్లు కాపురం చేసి, 2015లో అత‌ని నుంచి విడిపోయింది. త‌ర్వాత మ‌ళ్లీ పెళ్లి చేసుకోవ‌డానికి స‌రైన వ్య‌క్తి కోసం వెత‌క‌డం ప్రారంభించింది. ఒక‌వేళ త‌న‌కు 40 ఏళ్లు వ‌చ్చేలోగా స‌రైన వ్య‌క్తి దొర‌క‌క‌పోతే త‌న‌ను తానే పెళ్లి చేసుకుంటాన‌ని స్నేహితుల‌తో అనేది.

ఇటీవ‌ల త‌న‌కు 40 ఏళ్లు వ‌చ్చాయి. స‌రైన వ్య‌క్తి కూడా దొర‌క‌‌లేదు. దీంతో తాను అన్న‌ట్లుగానే త‌న‌ను తాను పెళ్లి చేసుకుంది. అంతేకాకుండా ఒంట‌రిగా ఈజిప్టుకు హ‌నీమూన్‌కి కూడా బ‌య‌ల్దేరింది. 70 మంది అతిథుల స‌మ‌క్షంలో పెళ్లిలో జంట‌గా చేయాల్సిన అన్ని ప‌నుల‌ను తానే ఒంట‌రిగా చేసింది. ఈ పెళ్లి కోసం పెద్ద మొత్తంలో డబ్బు కూడా ఖ‌ర్చుపెట్టింది. మ‌గాళ్ల‌పై ఆధార‌ప‌డే ఉద్దేశం లేకే తాను ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు లారా తెలిపింది. `సోలోగ‌మీ`గా పిలిచే ఈ స్వ‌యం వివాహం ఈ మ‌ధ్య ప్ర‌పంచంలోని వివిధ దేశాల్లో ట్రెండ్‌గా మారింది.
self married
italian women
honeymoon
ceremony
aisle
wedding

More Telugu News